నాసా జెల్లీ ఫిష్‌లను ఎందుకు స్పేస్‌కి పంపింది?
గురుత్వాకర్షణ శక్తి జీవుల పెరుగుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి 1991లో నాసా వేలాది జెల్లీఫిష్‌లను అంతరిక్షంలోకి పంపింది. అక్కడ పెరిగిన జెల్లీఫిష్‌లు భూమికి తిరిగి వచ్చాక, ఇక్కడి గురుత్వాకర్షణకు అనుగుణంగా కదలలేక ఇబ్బంది పడ్డాయి. అంతరిక్షంలో జీవుల సమతుల్యత ఎలా మారుతుందో అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన శాస్త్రవేత్తలకు ఎంతో సహాయపడింది.