చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు: డీఎస్పీ

చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు: డీఎస్పీ

SKLM: కాశీబుగ్గతో పాటు జిల్లాలో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం ఇద్దరి నిందితులను అరెస్టు చేసి, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ కాశీబుగ్గ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేశామన్నారు.