'పన్నుల వసూలులో నిర్లక్ష్యం తగదు'
E.G: పన్నుల వసూలులో నిర్లక్ష్యం తగదని.. నెలాఖరుకు వంద శాతం వసూలు లక్ష్యంగా ముందుకెళ్లాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. రెవిన్యూ అధికారులు, సిబ్బందితో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పన్ను వసూళ్ల పురోగతిని సమీక్షించి, లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు క్షేత్రస్థాయిలో తిరగాలన్నారు.