రూ.42,000 పలికిన గణపతి లడ్డు

ADB: ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం ఆధ్వర్యంలో గురువారం రాత్రి లడ్డు వేలం పాట కోలాహలంగా జరిగింది. ఈ వేలంలో గణపతి లడ్డును పద్మశాలి సంఘం నాయకుడు బూర్ల శంకరయ్య రూ.42,000 వేలం పాడి సొంతం చేసుకున్నారు.