'మహా జాతర ఉత్సవాలు జయప్రదం చేయాలి'

'మహా జాతర ఉత్సవాలు జయప్రదం చేయాలి'

SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయ ఏడు వారాల మహా జాతర బుధవారం ధ్వజారోహణతో ప్రారంభమైంది. ఈ నెల 23 నుంచి జూన్ 4 వరకు జరిగే ఈ వేడుకల కోసం ఈవో శివ రుద్రప్ప, చైర్మన్ మల్లయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఏడు వారాల పాటు వైభవంగా సాగే ఈ జాతరకు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.