టీటీడీకి జిల్లా వాసి రూ.30 లక్షల విరాళం

టీటీడీకి జిల్లా  వాసి రూ.30 లక్షల విరాళం

KMM: ఖమ్మం నగరానికి చెందిన అంకిత్ టీటీడీకి రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆయన వేంకటేశ్వర స్వామివారి సేవలో భాగంగా 'శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి' ఈ మొత్తాన్ని అందజేశారు. తిరుపతిలో అంకిత్ తన కుటుంబ సమేతంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కలిసి స్వయంగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.