నేతన్నలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం: మంత్రి సవిత

నేతన్నలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం: మంత్రి సవిత

పల్నాడు: చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రిని రాష్ట్ర పద్మశాలి సంఘ ప్రతినిధులు బుధవారం కలిశారు. ఈ నెల 26న నిర్వహించే పద్మశాలి మహాసభకు హాజరుకావాలని సంఘ ప్రతినిధులు మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రిచే మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.