VIDEO: ములుగులో మండల స్థాయి కళా పోటీలు

MLG: ములుగు మండల కేంద్రంలోని బండారుపల్లి మోడల్ పాఠశాలలో మండల స్థాయి కళా పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ దేవకి తెలిపారు. ఈ సందర్భంగా పాటలు, చిత్రలేఖనం, నృత్యం విభాగాల్లో విద్యార్థులకు పోటీలు జరిగాయని అనంతరం విజేతలకు బహుమతులు అందజేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.