పరిగిలో కుక్కల బెడద

పరిగిలో కుక్కల బెడద

VKB: పరిగి పురపాలక పరిధిలో వీధి కుక్కల బెడద తీవ్రమవుతోంది. గుంపులు గుంపులుగా తిరుగుతున్న శునకాలు దారినపోయే వారిపై దాడులకు తెగబడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే చిన్నారులు, ఇళ్ల ముందు ఆడుకునే పిల్లలపై కుక్కలు పడుతుండటంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.