ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ELR: చింతలపూడిలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సమయంలో ఒక మహిళ ఇటీవల జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా అద్దాలు పగలగొట్టేందుకు ఒక చిన్న రాడ్ తెచ్చుకోవడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురయ్యారు.