బ్యాంక్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి
HYD: హైదరాబాద్‌లోని హబ్సిగూడ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విషాదం చోటుచేసుకుంది. బ్యాంకుకు వచ్చిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి.. డిపాజిట్ స్లిప్ నింపుతుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.