గజపతినగరంలో చికెన్ అండ్ ఎగ్ మేళా

VZM: గజపతినగరంలోని రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించారు. వెంకోబ్బ సంస్థ విజయనగరం జిల్లాలో 9 కేంద్రాల్లో ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన తొలగించడమే ముఖ్య ఉద్దేశమని చెప్పారు.