నర్రవాడలో వేలం పాటల నిర్వహణ
NLR: నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయంలో వివిధ హక్కులు పొందేందుకు బహిరంగ వేలం నిర్వహించారు. పూజా ద్రవ్యాలు విక్రయించుకునే హక్కును రూ.30.2 లక్షలకు, అమ్మవారికి సమర్పించే చీరలు, జాకెట్లను సేకరించే హక్కును రూ.8.2 లక్షలకు, పొంగలి సామగ్రిని విక్రయించే హక్కును రూ.1.36 లక్షలకు, పుష్పాలు, పూలమాలలను సరఫరా చేసే హక్కును రూ.5.15 లక్షలకు పలువురు దక్కించుకున్నారు.