ఆంజన్న ఆలయ పరిసరాల్లో 500 పండ్ల మొక్కలు

ఆంజన్న ఆలయ పరిసరాల్లో 500 పండ్ల మొక్కలు

JGL: ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో ఆకలితో అల్లాడుతున్న కోతులకు శాశ్వత ఆహారం అందించడానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో పాటు, ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 పైగా పండ్ల మొక్కలను నాటారు. అల్లనేరడు, రేగు, సీతాఫలం, మేడి, చింతలాంటి అనేక రకాల పండ్ల మొక్కలను విద్యార్థులతో నాటించారు.