కోడూరు బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

కోడూరు బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

NLR: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరులోని బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడిన వారిని వెంటనే నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు వారిని డిశ్చార్జ్ చేశారని ప్రిన్సిపాల్ ఎస్తేరమ్మ తెలిపారు.