వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం

వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం

RR: మదినగూడ గ్రామంలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలింగ్ గౌతమ్ గౌడ్, లోక కళ్యాణం కోసం జరిగిన ఈ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.