కూలిన ఇళ్లు.. దిక్కుతోచని స్థితిలో కుటుంబం
MHBD: నిన్న కురిసిన భారీ వర్షానికి తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన చెరుకూరి నరసయ్య నివాసముండే రేకుల ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి బయట ఉండడంతో పెద్ద పెను ప్రభావం తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.