శ్రీనిధి రుణాలపై సమీక్షించిన కలెక్టర్

CTR: పట్టణ ప్రాంతాలలో గల స్వయం సహాయక సంఘ మహిళల ఆర్థిక పురోభివృద్ధికి మహిళా సాధికారతకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు అందించే బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలు తదితర అంశాలపై ఎల్‌డిఎం, మున్సిపల్ కమిషనర్లతో కలిసి సమీక్షించారు.