తాళం వేసిన ఇంట్లో చోరీ
KDP: తాళం వేసిన ఇంట్లో 15 గ్రాముల బంగారం చోరీ చేసిన ఘటన వేంపల్లెలోని రాజీవనగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బాధితుడు గురజాల ప్రతాప్ సోమవారం తన అన్న వద్దకు గుత్తికి వెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగి నట్లు గుర్తించాడు. బీరువా తెరిచి చూడగా 15 గ్రాముల బంగారం అందులో లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు.