​రామాయంపేటలో ఆర్డీవో ఆకస్మిక తనిఖీలు

​రామాయంపేటలో ఆర్డీవో ఆకస్మిక తనిఖీలు

MDK: రామాయంపేట మండలంలో సోమవారం ఆర్డీవో రమాదేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపులను సందర్శించి స్టాక్ రిజిస్టర్లను, నిల్వలను పరిశీలించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మకూడదని దుకాణదారులను ఆదేశించారు. మండలంలో యూరియా పంపిణీ ప్రశాంతంగా జరుగుతోందని, రైతులకు ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు.