VIDEO: ఆశ్రమ పాఠశాలలో భారీ సర్పం హల్ చల్
ASR: కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల-1లో గురువారం రాత్రి విషపూరిత జాతికి చెందిన అరుదైన భారీ సర్పం హల్ చల్ చేసింది. రాత్రి సమయంలో భారీ పాము పాఠశాలలోకి ప్రవేశించడంతో సిబ్బంది, విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. భయంతో పరుగులు తీశారు. అయితే విషయం తెలిసి అక్కడికి చేరుకున్న స్థానికులు ప్రాణభయంతో, విషపూరితమైన ఆ భారీ పామును కొట్టి హతమార్చారు.