కేజీహెచ్‌కు రోటరీ క్లబ్ విరాళం
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగానికి రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ రూ.8 లక్షల విలువైన శస్త్రచికిత్స పరికరాలను అందజేసింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మంగళగిరి సుదర్శన్ స్వామి మాట్లాడుతూ.. అవసరమైన వైద్య సదుపాయాల కల్పనలో రోటరీ క్లబ్ ముందుంటుందని తెలిపారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ.వాణి ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.