కోటి తలంబ్రాల దీక్షలో మాజీ సర్పంచ్

SDPT: భద్రాచల సీతారాముల కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల దీక్షలో సోమవారం మార్కుక్ మండలం అంగడికిష్టాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దుద్దెడ రాములు గౌడ్ దంపతులు పాల్గొన్నారు. రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను వలిచారు. అనంతరం శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు రామకోటి రామరాజుకు తలంబ్రాలను అందజేసి తమ రామభక్తిని చాటుకున్నారు.