'30 వరకు పంట వివరాలు ఆన్‌లైన్ చేసుకోవాలి'

SRD: పంటలు వివరాలను ఆన్‌లైన్‌లో ఈ నెల 30వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంటలు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయకుంటే అమ్ముకోవడానికి అవకాశం ఉండదని పేర్కొన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఆన్‌లైన్ చేసుకోవాలని సూచించారు.