వరసిద్ధుడి సేవలో ప్రభుత్వ విప్
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. వరసిద్ధి స్వామివారిని దర్శించుకోవడం పుణ్యప్రదమని బోండా ఉమా అన్నారు.