డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిరంతర నిఘా
BPT: జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగే ప్రాంతాలపై శుక్రవారం పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం తాగడం, గంజాయి వాడకం, పేకాట, ఈవ్‌టీజింగ్, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సాంకేతికతను వినియోగించి జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.