కనిగిరి ప్రజలకు విజ్ఞప్తి

కనిగిరి ప్రజలకు విజ్ఞప్తి

ప్రకాశం: కనిగిరి పట్టణంలో RWS కార్యాలయం వద్ద త్రాగునీటి పైపులు తుప్పు పట్టి లీకులు ఏర్పడటంతో మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పట్టణంలో నీటి సరఫరా నిలిపివేస్తామని మునిసిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ తెలిపారు. ప్రజలు ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని, సహకరించాలని కోరారు.