రేపు భైంసాలో కొనసాగనున్న ప్రజావాణి కార్యక్రమం
NRML: ప్రతి బుధవారం భైంసా పట్టణంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా వాయిదా పడిన భైంసా ప్రజావాణి కార్యక్రమం రేపు భైంసా క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ ప్రజల ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఫిర్యాదుదారులు హాజరు కావాలని ఎస్పీ క్యాంప్ అధికారులు సూచించారు.