రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: ఎస్పీ
KRNL: రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆదివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఓవర్ స్పీడ్ 1,189, హెల్మెట్ లేకుండా 1,075, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 260, 1,069 డ్రంక్ & డ్రైవ్, 1,908 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాన్నారు.