భజనలతో మారు మ్రోగిన ఆలయం

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీపరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భజనభక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలోమోస్తూ ఆటపాటలతో భజనలతో ఊరేగింపు చేపట్టారు. భక్తి పాటలు, భజనలు, శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. కార్యక్రమంలో కేశంపేట మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు.