నేడు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇవాళ మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 నుంచి రాత్రి 7:30 గంటల వరకు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.