సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కవాతు
SRPT: మున్సిపల్ ఎన్నికల వేళ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్లాగ్ మార్చ్ చేపట్టారు. ఎన్నికల వేళ తగాదాలకు దిగి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కితే భవిష్యత్తు అంధకారమేనని హెచ్చరించారు. ఓటర్లు భయం వీడి, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని భరోసా ఇచ్చారు.