అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్ సీజ్
KNR: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. బొమ్మకల్ ఫ్లెఓవర్ వద్ద సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎల్లవేణి శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు KNR రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.