జాతీయ రహదారి పనులను పరిశీలించిన ఆర్‌డీవో

జాతీయ రహదారి పనులను పరిశీలించిన ఆర్‌డీవో

TPT: పుత్తూరు పరిధిలోని పరమేశ్వర మంగళం గ్రామం మీదుగా సాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను ఆర్‌డీవో రామ్మోహన్ పరిశీలించారు. గృహ యజమానులతో చర్చించి పనులకు సహకరించాలని కోరారు. నష్టపరిహారం పై అసంతృప్తి ఉంటే కలెక్టర్ వద్ద ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని సూచించారు. పనుల్లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.