ధర లేక అరటి తోటల తొలగింపు

ధర లేక అరటి తోటల తొలగింపు

ATP: పుట్లూరు మండలంలో అరటి రైతులకు ధర లేక తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను ఉంచినా ప్రయోజనం లేదని భావించిన అన్నదాతలు, గెలలు ఉన్న అరటి తోటలనే తొలగిస్తున్నారు. కష్టపడి పండించిన పంటను నరికి వేయాల్సిన దుస్థితి ఏర్పడటంపై రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. టన్ను కేవలం రూ.1000 పలుకుతోందని తెలిపారు.