రేపల్లె ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవి

రేపల్లె ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవి

BPT: రేపల్లె ఆర్డీవోగా నియమితులైన బి. శ్రీదేవి బుధవారం అధికార బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. డివిజన్‌లో ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.