తిరుపతిలో టీడీపీ నేతల సంబరాలు

తిరుపతిలో టీడీపీ నేతల సంబరాలు

TPT: టీటీడీ ఛైర్మన్ B.R. నాయుడు ఒక సంవత్సరం పాలన పూర్తి చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద షాప్ ఛైర్మన్ రవి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా B.R. నాయుడుకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన నేతృత్వంలో టీటీడీ అభివృద్ధి పథంలో సజావుగా నడుస్తోందని తెలిపారు.