VIDEO: 'సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోండి'

తూ.గో: సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. అనపర్తి మండలం రామవరంలో శనివారం ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగించాలని సూచించారు. స్థానిక ప్రజలు, ఎన్ఆర్ఈజీఎస్ సమన్వయం చేసుకుంటూ సక్రమంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.