గాయానికి కుట్లకు బదులు ఫెవిక్విక్..!
యూపీ మీరట్‌లో వింత ఘటన వెలుగుచూసింది. రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా తలకు గాయమైంది. రక్తస్రావం తీవ్రంగా ఉండడంతో వెంటనే తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాన్ని పరిశీలించిన డాక్టర్ కుట్లకు బదులు ఫెవిక్విక్ రాసి అతికించాడు. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ కాగా.. డాక్టర్ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.