చోరీల కేసులో నిందితుడి అరెస్టు

చోరీల కేసులో నిందితుడి అరెస్టు

ప్రకాశం: వెలిగండ్ల మండలం రాజగోపాలపురానికి చెందిన రాగి మహేంద్రరెడ్డి జాతీయ రహదారి వెంట ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఆ క్రమంలో ఈ నెల 18న రామాపురం సమీపంలోని దుకాణంలో చోరీకి యత్నిస్తుండగా సీసీ కెమెరాలో నమోదైంది. వాటి ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వారినుంచి 6మొబైల్ ఫోన్లు, స్కానర్లు, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.