ఆముదాలవలసలో సామూహిక కుంకుమ పూజలు
SKLM: ఆముదాలవలస పట్టణంలోని ప్రసిద్ధ పాలపోలమ్మ తల్లి ఆలయంలో గురువారం సాయంత్రం ఘనంగా సామూహిక కుంకుమపూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తల్లి ఆశీస్సులు పొందారు. హోమం, అభిషేకం అనంతరం మహిళలు సంప్రదాయబద్ధంగా కుంకుమపూజలు చేశారు. దసరా రోజున జరిగే ఈ కార్యక్రమం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా కొనసాగుతుందని ఆలయ ఛైర్మన్ రమేష్ తెలిపారు.