నేడు కామవరపుకోట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
ELR: కామవరపుకోట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించే సర్వసభ్య సమావేశంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరళ కుమారి తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షురాలు మేడవరపు విజయలక్ష్మి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్రమైన రిపోర్టులతో సమావేశానికి హాజరుకావాలని కోరారు.