నవీన్ ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే?
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. BRS పార్టీపై 24,658 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించారు. ఏ ఒక్క రౌండ్‌లోనూ BRS అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు సీఎం రేవంత్ సర్కార్‌కు, కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహానిచ్చింది.