పంది అడ్డు రావడంతో ప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు
ASF: ఆసిఫాబాద్ నుంచి జైనూర్ వైపు బైక్‌పై వెళ్తుండగా పంది అడ్డంగా రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు భీమ్రావు , లక్ష్మణ్, శంకర్‌గా గుర్తించారు. వీరు సిర్పూర్ మండలం రుదకాస గ్రామానికి చెందినవారని తెలిపారు. అనంతరం స్థానికులు 108కి సమాచారం ఇవ్వగా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.