'సమస్యలను పరిష్కరిస్తాను'
WGL: ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలను నివారించేందుకు, శానిటేషన్ కాంట్రాక్టర్లకు అనుమతులపైన అగ్రికల్చర్ నిపుణులతో చర్చించనున్నట్టు డీఎంఈ నరేంద్ర కుమార్ తెలిపారు. ఎలుకల స్వైర విహారంపై స్పందిస్తూ, త్వరలోనే నిపుణులతో చర్చించి ఎంజీఎంలో శానిటేషన్ ప్రక్రియను మెరుగు పరుస్తామన్నారు. కొత్తగా ఎంజీఎంకు ఆర్ఎందోల నియామకాలను చేపడుతామని, సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.