'అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం'

'అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం'

ప్రకాళం: మార్కాపురంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ఇవాళ్టి నుంచి జరిగే ఏర్పాట్లను నిన్న ఆయన పరిశీలించారు. అలాగే బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.