ఈ నెల 28 నుంచి ప్యాసింజర్ రైలు రద్దు
BDK: విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు యార్డు రీమోడలింగ్, నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 28 నుంచి మే 5 వరకు విజయవాడ-భద్రాచలం రోడ్డు (67215), భద్రాచలం రోడ్డు-విజయవాడ (67216) ప్యాసింజర్ రైళ్లు నడవవని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.