సెలూన్ షాప్ నిర్వాహకుడికి జీఎస్టీ షాక్

సెలూన్ షాప్ నిర్వాహకుడికి జీఎస్టీ షాక్

AP: ఓ సామాన్య సెలూన్ షాప్ నిర్వాహకుడికి జీఎస్టీ అధికారులు ఊహించని షాకిచ్చారు. ఏకంగా రూ.72 లక్షల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. విజయవాడకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ చిన్న సెలూన్ సెంటర్‌ను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే జీఎస్టీ శాఖ ఇచ్చిన నోటీసులో ఆయన భారీ ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహించారని పేర్కొన్నారు.