తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టిస్తే కఠిన చర్యలు

TPT: తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టిస్తే కఠిన చర్యలు చేపడతామని గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూడూరు పట్టణానికి చెందిన మొగిరాల నాగేశ్వర రావు కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం కోసం అప్లై చేసుకున్నాడని, కుటుంబ సభ్యుల వివరాలు దాచిపెట్టి సర్టిఫికెట్‌ను పొందడం జరిగిందన్నారు.