VIDEO: ఆమనగల్లు జాతరలో అపశృతి

VIDEO: ఆమనగల్లు జాతరలో అపశృతి

NLG: వేములపల్లి మండలం ఆమనగల్లులోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండాలను దాటుతున్న భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో అగ్నిగుండంలో పడిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై పడిపోతున్నవారిని బయటికి లాగారు. ఈఘటనలో పది మంది భక్తులు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.